Saturday, October 4, 2025
E-PAPER
Homeసినిమాన్యూ ఏజ్‌లవ్‌ స్టోరీ

న్యూ ఏజ్‌లవ్‌ స్టోరీ

- Advertisement -

చైతన్య రావు మదాడి, ఐరా, సాఖీ హీరో, హీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రేయాస్‌ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్‌ బ్యానర్ల మీద పూర్ణా నాయుడు, శ్రీకాంత్‌.వి ప్రొడక్షన్‌ నెంబర్‌.5గా దీన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్‌ కొట్టగా, కెఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్‌ స్క్రిప్ట్‌ అందజేయగా, తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు క్రాంతి మాధవ్‌ మాట్లాడుతూ, ‘చైతన్యతో రెండో సినిమా. ఈ సినిమాతో ఐరా తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. సాఖీ బెంగాలీలో సీరియల్స్‌ చేశారు. ఈ మూవీతో ఆమె కూడా తెలుగులోకి రాబోతోన్నారు. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది.

అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నాం’ అని అన్నారు. ‘క్రాంతితో నాది మూడేళ్ల బంధం. ఆయనతో బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలు చేస్తున్నాను. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే.. ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియెన్స్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని హీరో చైతన్య రావు చెప్పారు. నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ, ‘క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు మా ఇద్దరికీ సమయం కుదిరింది. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్‌ నా ప్రతీ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అవుతూనే ఉంటారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్‌, సినిమాటోగ్రాఫర్‌: జ్ఞాన శేఖర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: చిన్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -