– మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
సిమెంట్ రోడ్లతో గ్రామాలకు కొత్త కళ వస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను అందిస్తుందన్నారు. గ్రామాల్లో వేస్తున్న సిమెంట్ రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపైనే ఉందన్నారు.
సిమెంట్ రోడ్లపై కేజీ వీల్స్ ను తిప్పి రోడ్డు ధ్వంసం అయ్యే పనులను గ్రామస్తులు చేయొద్దని సూచించారు.ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, నియోజక వర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ బుసాపురం సంధ్యా రాజశేఖర్, ఉప సర్పంచ్ కట్ట రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



