నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలలో నూతన అభ్యర్థులను ఎన్నుకోవాలని కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి రాపోలు భాస్కర్ అన్నారు. పట్టణంలోని గురువారం ప్రెస్ క్లబ్ భవనంలో బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు రాపోలు భాస్కర్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయవాదులకు ఎటువంటి న్యాయం చేయకుండా పదవులు అనుభవిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్న కౌన్సిల్ మాత్రం నోరు విప్పడం లేదని అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నూతన అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.
బార్ కౌన్సిల్ మెంబర్గా తాను బరిలో ఉన్నానని,న్యాయవాదులు తనకు మద్దతు ప్రకటించి గెలిపించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులతో పాటు, జూనియర్ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, న్యాయవాదుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల్లో బార్ అసోసియేషన్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, కోశాధికారి చైతన్య, హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ, న్యాయవాదులు అరుణ్, టి.కోనేరు, నరేష్, విశ్వనాధ్, రాజేశ్వర్, పవన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.



