Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటి ఎన్నిక

పరకాల టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటి ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పరకాల డివిజన్ నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ మేరకు శనివారం నూతన కమిటీని జిల్లా అద్యక్ష, కార్యదర్శులు టివి రాజు,అంతడుపుల శ్రీనివాస్ లు ప్రకటించారు. టిడబ్ల్యుజేఎఫ్ డివిజన్ అద్యక్షులుగా కోగిల చంద్రమౌళి, ఉపాద్యక్షులుగా చెరుపెల్లి సత్యం,చిట్టిరెడ్డి అజయ్ రెడ్డి,కార్యదర్శిగా కొల్లూరి ప్రేమ్ చంద్,కోశాధికారి గా సిలువేరు రాజు సహాయ కార్యదర్శులు నాగెల్లి సంతోష్ ,గీరబోయిన రాజు కార్యవర్గ సభ్యులుగా,దొమ్మటి అంబేద్కర్,ముక్కెర చిరంజీవి, చుక్క సతీష్,గొట్టె రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అద్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -