Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టు భవనం

సత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టు భవనం

- Advertisement -

– రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌
– సిరిసిల్లలో నూతన కోర్టు బిల్డింగ్‌ సముదాయానికి నిర్మాణానికి భూమి పూజ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. సిరిసిల్లలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో 12 రకాల న్యాయస్థానాలు సెల్లార్‌తో పాటు టెన్‌ ప్లస్‌ టు శైలిలో నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరిష్‌ కుమార్‌ సింగ్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలో పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కషి చేయాలన్నారు. జిల్లా కోర్టులో 13 వేల కేసులు పైగా కేసులు పెండింగ్‌లోనున్నట్టు తెలిపారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని, సంబంధిత అధికారులు సమన్వయముతో పని చేయాలని ఆదేశించారు.

న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం
ఈ నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని హై కోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ అన్నారు. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను కాపాడే న్యాయవ్యవస్థకు ఉన్న నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -