- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నంలో కొవిడ్ కేసు నమోదైంది. నగరంలోని మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు.. అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనూ పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆ యువతిని గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఆమె ప్రయాణం చేయలేదని కుటుంబసభ్యులు చెప్పారని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశించామన్నారు.
- Advertisement -