Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం14 తర్వాత తెలంగాణలో కొత్త తుఫాన్‌

14 తర్వాత తెలంగాణలో కొత్త తుఫాన్‌

- Advertisement -

ఎగిరిపడేవారి తోకలు కట్‌ చేస్తా.. : రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈ నెల 14వ తేదీ తర్వాత తెలంగాణలో కొత్త తుఫాను రాబోతుందని, కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. పోలీసులు ఎక్కువ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 500 రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాబోతుందని, ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుకుని ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో.. వాడి తోక కట్‌ చేస్తా.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తాత దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో శనివారం కేటీఆర్‌ మాట్లాడారు. కొంత మంది ఆకు రౌడీలు, గుండాగాళ్లు ఓటేయకపోతే ఏమో చేస్తామని బెరిస్తున్నారని విమర్శించారు.

నేడు అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారని, 14వ తేదీన దిమ్మ తిరుగుతదని అన్నారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోతున్నట్టు సర్వేలో డౌన్‌ కాగానే.. అజారుద్దీన్‌ను మంత్రిని చేశారని, సినిమా వాళ్ల వద్దకు పోయారని, సీఎం, మంత్రులు గల్లీగల్లీ తిరుగుతున్నారని విమర్శించారు. ఓటమి భయంతో ఇన్ని పనులు చేసినోళ్లు.. ఓడగొడితే సచ్చుకుంటూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తారు కదా..? అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడగోడితేనే తులం బంగారం, పెన్షన్లు వస్తాయన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -