Tuesday, November 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ‌లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ!

తెలంగాణ‌లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తమిళనాడు తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ(TEP)ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ అడ్వైజర్ కె.కేశవరావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా TEPని రూపొందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -