Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైన్ షాప్ టెండర్లలో కొత్త వారికి అవకాశం కల్పించాలి

వైన్ షాప్ టెండర్లలో కొత్త వారికి అవకాశం కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో గల 49 వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెండర్లు కొందరు దినముల నేర్పాట చేసుకుని టెండర్లు వేస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా  వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులదే పెత్తనంగా మారి ఎక్కువ మొత్తంలో షాపులను దక్కించుకుంటున్నారన్నారు. ఎస్సీ రిజర్వుడు షాపు లలో సైతం బినామీ పేర్లతో వేయించి ఆ షాపులను వారే తమ వశం చేసుకుంటున్నారు. దీన్ని ఒక పెద్ద వ్యాపారంగా మలుచుకున్నారు.

వీరి వల్ల కొత్త వారికి అవకాశాలు రాలేకపోతున్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా కంటిన్యూగా టెండర్లు వేసి వైన్ షాపులను దక్కించుకుంటున్న వారిని ఈసారి టెండర్లు వేయించకుండా ఆపి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, కొత్తవారికి కూడా ఉపాధి అవకాశాలు లభించాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ తరపున కామారెడ్డి ప్రజావాణిలో కలెక్టరేట్లో కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అలా చేస్తే ఈ రిజర్వేషన్లు అమలు చేసి కూడా ఫలితం లేదన్నారు. ఇందులో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా  ఉపాధ్యక్షులు తమ్మడి స్వామి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -