నవతెలంగాణ – రెంజల్ : మండల కేంద్రమైన రెంజల్ ఐకేపీ కార్యాలయంలో మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు ఏపీఎం చిన్నయ్య తెలిపారు. మండలంలోని 34 గ్రామ సంఘాల అధ్యక్షుల అభిప్రాయాల మేరకు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరి పదవి కాలం ఒక సంవత్సరం వరకు కొనసాగుతారని ఆయన తెలిపారు. నూతన మండల సమైక్య అధ్యక్షురాలుగా ప్రమీల, ఉపాధ్యక్షులు నాగమణి, కార్యదర్శిగా సావిత్రి, సహాయ కార్యదర్శిగా సుచరిత, కోశాధికారిగా సునితలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని ఐకెపి కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం చిన్నయ్య, సి స లు భాస్కర్, శ్యామల, రాజయ్య, కృష్ణ, సునీత, అకౌంటెంట్ తస్లీమా, మండలంలో ని 34 గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES