నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్ పద్మజ్యోతి పద్మశాలి సంఘం 49వ తర్పా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సంఘ భవనంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాద్యక్షులు దీకొండ యాదగిరి ముఖ్యాతిధిగా హాజరై ప్రసంగించారు. పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. పద్మశాలీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు సంఘాల బాధ్యులు కృషి చేయాలన్నారు.అనంతరం పద్మజ్యోతి పద్మశాలి సంఘం అద్యక్ష కార్యదర్శులు అంకం రాజేందర్, గజం సుదర్శన్, కోశాధికారి సుప్పాల వెంకట లక్ష్మణ్ లతో పాటు ఇతర కార్యవర్గం చేత నిజామాబాదు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, పద్మజ్యోతి పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు బత్తుల భుమయ్య, కోట్టురి హన్మండ్లు, కార్యనిర్వహక కార్యదర్శి పాము రాకేష్ , సహాయ కార్యదర్శులు బోమ్మెర సాయన్న , పెంట నారాయణ, కార్యవర్గ సభ్యులు కట్ట వరప్రసాద్, గడ్డం సురేష్, ముఖ్య సలహాదారులు బత్తుల మురళి, రెగోండ మెహన్ కూమార్ ,పెంట అంబదాస్,నగర కమిటీ సభ్యులు అడిచర్ల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం 49వ తరపున నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES