– భార్యా భర్తలు
– మాజీ ప్రజాప్రతినిధులు –
వైద్యనిపుణులు
– ప్రధమ పాలకవర్గం సభ్యుల్లో ప్రత్యేకతలు ఎన్నో..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గం సభ్యుల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి చైర్మన్ గిరీ ని 6 వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన సాధారణ గృహిణి జూపల్లి శశికళ కైవసం చేసుకోనుండటం ఒక విశేషం అయితే డిప్యూటీ చైర్మన్ గా 13 వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన ఆమె భర్త జూపల్లి రమేష్ బాబు ఎంపిక కానుండటం మరో విశేషం. ఈ పాలకవర్గం సభ్యుల్లో ఆరుగురు గతంలో ప్రజాప్రతినిధులు గా పనిచేసారు.
వీరిలో 13 వ వార్డు కౌన్సిలర్ జూపల్లి రమేష్ బాబు అశ్వారావుపేట పంచాయతీ వార్డు మెంబర్ గా,10 వ వార్డు కౌన్సిలర్ మిండ హరిబాబు పేరాయిగూడెం ఉపసర్పంచ్,ఎంపీటీసీ గా,16 వ వార్డు కౌన్సిలర్ దండాబత్తుల ఆదిలక్ష్మి అశ్వారావుపేట వార్డు మెంబర్ గా,12 వ వార్డు కౌన్సిలర్ అట్టం రమ్య – మేజర్ పంచాయతీ చివరి సర్పంచ్ గా,7 వ వార్డు కౌన్సిలర్ కొల్లి రవికిరణ్ – పేరాయిగూడెం ఎంపీటీసీ గా,19 వ వార్డు కౌన్సిలర్ జినుగు రవీంద్ర కుమార్ అశ్వారావుపేట పంచాయతీ వార్డు మెంబర్ లు గా గతంలో ప్రజాప్రతినిధులు గా పనిచేసారు.
మరో 16 మంది కౌన్సిలర్ లలో 9 వ వార్డు కౌన్సిలర్ కారం కనకదుర్గ,2 వ వార్డు కౌన్సిలర్ దగ్గుమల్లి మౌనిక,3 వ వార్డు కౌన్సిలర్ చిన్నంశెట్టి శ్రీను,1 వ వార్డు కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్,11 వ వార్డు కౌన్సిలర్ నార్లపాటి మహేష్ బాబు,4 వ వార్డు కౌన్సిలర్ కట్ట సింధుజ,6 వ వార్డు కౌన్సిలర్ జూపల్లి శశికళ,18 వ వార్డు కౌన్సిలర్ తిరుమలశెట్టి వెంకన్న బాబు (18),ఆంకారవళీ నూర్జహాన్,14 వ వార్డు కౌన్సిలర్ భూక్య ఉదయ్ జ్యోతి,15 వ వార్డు కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి,22 వ వార్డు కౌన్సిలర్ నార్లపాటి దివాకర్,17 వ వార్డు కౌన్సిలర్ గుంట గీత శ్రీ,21 వ వార్డు కౌన్సిలర్ నార్లపాటి మౌనిక,5 వ వార్డు కౌన్సిలర్ నాగ సునీత కొట్టే,8 వ వార్డు కౌన్సిలర్ రెహానా షేక్ లు రాజకీయాలకు కొత్త ముఖాలు కావడం మరో విశేషం.
డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి స్త్రీ వ్యాధుల వైద్యులు.ఈమె భర్త డాక్టర్ ప్రసాద్ వైద్యులు. కట్టా సింధుజ భర్త కట్టా శ్రీను మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్. రెహానా షేక్ భర్త వలీ పాషా ఎలక్ట్రానిక్ మీడియా టీవీ 5 ప్రతినిధిగా,విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. 7 వ వార్డు కౌన్సిలర్ కొల్లి రవికిరణ్ అశ్వారావుపేట మేజర్ పంచాయతీ లో ఎంపీటీసీ గా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన ఛానెల్ టీవీ 9 ప్రతినిధిగా ఉన్నారు.
22 మంది కౌన్సిలర్ లలో 9 మంది పురుషులు,13 మంది మహిళలు, సామాజిక వర్గం వారీగా బీసీలు 9, ఎస్సీ లు 7, ఎస్టీ లు 3,ఓసీ లు 3 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో విద్యాపరంగా 16 మంది అండర్ గ్రాడ్యుయేట్,6 గురు గ్రాడ్యుయేట్ చేసారు. వయసు పరంగా 60 సంవత్సరాల పైబడిన వారు 1,50 పైబడిన వారు 3,40 పైబడిన వారు 6,30 పైబడిన వారు 9,20 పైబడిన వారు 3 చొప్పున ఉన్నారు. పురుష కౌన్సిలర్ లలో జూపల్లి రమేష్ బాబు 58 ఏళ్ల పెద్దవారు కాగా,నార్లపాటి దివాకర్ 35 ఏళ్ల చిన్న వయస్కుడు.
మహిళా కౌన్సిలర్ లలో దండాబత్తుల ఆదిలక్ష్మి 65 ఏళ్ల పెద్ద వారు కాగా,గుంట గీత శ్రీ 23 ఏళ్ల చిన్న వయస్కురాలు. అన్ని వర్గాల,అందరి సమస్యలు తెలిసిన ఎంతో కొంత రాజకీయ, సామాజిక స్పృహతో రాజకీయ వేదిక తో ప్రజాసేవ లోకి అడుగుపెట్టిన వీరికి నవతెలంగాణ అభినందనలు.



