- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇంస్టాగ్రామ్ రీల్స్‌కు ‘ఆటో స్క్రోల్’ అనే కొత్త ఫీచర్‌ను మెటా టెస్టింగ్ చేస్తోంది. ఆటో స్క్రోల్ ఫీచర్, రీల్స్‌ను తనంతట అవే స్క్రోల్ చేసేలా రూపొందించబడుతోంది. యూజర్ ఎలాంటి స్వైప్ చేయకుండానే ఒక రీల్ పూర్తవగానే తదుపరి రీల్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. దీనివల్ల రీల్స్ వాచ్‌టైమ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది డిజిటల్ వ్యసనాన్ని మరింత పెంచుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
- Advertisement -