రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఉద్వాసన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్‌గా టీడీపీ నేత ,మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు టీడీపీలో ఉన్నారు. గతంలో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయనను గోవా గవర్నర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక హర్యానా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన ఆయనను తొలుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ఆ తరువాత హర్యానా గవర్నర్‌గా నియమించారు. తాజాగా ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను నియమించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈయన ప్రొఫెసర్‌గా ఉన్నారు. అదే విధంగా లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి బిడి మిశ్రా (రిటైర్డ్) చేసిన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారనీ, ఆయన స్థానంలో కవిందర్ గుప్తాను నియమించారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. రాష్ట్ర హౌదా, ఇతర రాజ్యాంగ రక్షణలను డిమాండ్ చేస్తూ లద్దాక్ అపెక్స్ బాడీ ప్రకటించిన తాజా ఆందోళనల నేపథ్యంలో గుప్తా నియామకం జరిగింది. కాగా.. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్ పదవిని చేపట్టిన వారిలో తెలుగువారు చాలా మందే ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్‌భవన్‌లో తెలుగువారు గవర్నర్లుగా ఆశీనులయ్యారు. అందులో తెలుగురాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గా చేసిన ప్రముఖులూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఓడిశా, తమిళనాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితో పాటు తెలుగింటి కోడలుగా వచ్చిన ఒకరు కూడా గవర్నర్లుగా పని చేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు.
మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES