నవతెలంగాణ – కంఠేశ్వర్
గడ్డి, వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను నియంత్రించడానికి ఒక వినూత్న పరిష్కారం, ఐఎస్ కె జపాన్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. భారతదేశంలోని ప్రముఖ వైవిధ్యభరితమైన వ్యవసాయ – వ్యాపార సంస్థలలో ఒకటైన గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రేజ్ ఆగ్రోవెట్), మొక్కజొన్న పంట తో పాటుగా వచ్చే కలుపు మొక్కలను నివారించటం కోసం ప్రత్యేకంగా కొత్త కలుపు మందును విడుదల చేసినట్లు వెల్లడించింది. ఐఎస్ కె జపాన్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ నూతన కలుపు మందును ‘ అషిటక’ పేరిట మార్కెట్ లోకి తీసుకువచ్చింది. భారతదేశంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు అయినటువంటి గడ్డి మరియు వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను సమర్థవంతమైన రీతిలో నియంత్రించేందుకు తీసుకువచ్చిన ఒక వినూత్న పరిష్కారం ఇది. మొక్కజొన్న పంటకు కలుపు ముట్టడి ప్రధాన సమస్యగా ఉంటుంది.
మరీ ముఖ్యంగా పంట పెరుగుదల దశలలో ఇది అధిక సమస్యను కలిగిస్తుంది. అషిటకను 2 నుండి 4 ఆకుల కలుపు దశలో వినియోగిస్తే , మెరుగైన రీతిలో కలుపు నియంత్రణను అందించగలదు.ఈ ఆవిష్కరణ సందర్భంగా గోద్రేజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ.. పర్యావరణ, మార్కెట్ సవాళ్ల నుండి వ్యవసాయ రంగ భవిష్యత్తును కాపాడేలా, భారతీయ రైతులకు సాధికారత కల్పించే, వ్యవసాయ కుటుంబాలను ఉద్ధరించే వినూత్నమైన, పరిశోధన-ఆధారిత పరిష్కారాలను అందించడం గోద్రేజ్ ఆగ్రోవెట్ వద్ద మా లక్ష్యం. మొక్కజొన్న రైతులు మెరుగైన దిగుబడిని సాధించడానికి పంట ఎదిగే తొలిదశలో సమర్థవంతమైన రీతిలో కలుపు నిర్వహణ చేయడం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతంలోని రైతులకు దిగుబడిని మెరుగుపరచడానికి , లాభదాయకతను పెంచడానికి శక్తివంతమైన పరిష్కారాన్ని అందించే దిశగా వేసిన ఒక ముందడుగుగా అషిటక విడుదల నిలుస్తుంది అని అన్నారు.
అషిటక యొక్క ప్రభావవంతమైన కలుపు నియంత్రణ లక్షణాలు, మొక్కజొన్న పంటలో పంట-కలుపు పోటీని తగ్గిస్తుంది, పరిమితంగా వుండే నేల తేమ మరియు పోషకాలను మెరుగైన రీతిలో ఉపయోగించుకునేలా చేస్తుంది , పుష్పించే మరియు ధాన్యంగా మారేటటు వంటి క్లిష్టమైన దశలలో మొక్కల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. సిఫార్సు చేయబడిన మోతాదు అంటే – 2 – 4 కలుపు ఆకు దశలో 400 ఏం ఎల్/ఎకరం సర్ఫ్యాక్టెంట్‌తో 50 ఏం ఎల్/ఎకరం. ఈ మోతాదు కలుపు మొక్కలను ముందుగానే నియంత్రించడంలో సహాయపడుతుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా మరింత తీవ్రమయ్యే కలుపు సంబంధిత దిగుబడి నష్టాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
దీని ఫలితంగా మరింత స్థిరమైన ఉత్పత్తి, మెరుగైన పంట నాణ్యత, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో ఎదురయ్యే ఆదాయ అస్థిరతలనుంచి కాపాడుతుంది. పశువుల మేత గా మాత్రమే కాకుండా పరిశ్రమ మరియు జీవ ఇంధనం కోసం కూడా మొక్కజొన్నకు డిమాండ్ పెరుగుతున్నందున, గోద్రేజ్ ఆగ్రోవెట్ రైతులకు వివిధ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి అషిటకను విడుదల చేసింది. ఇది ఏడాది పొడవునా సరఫరాకు మద్దతు ఇస్తుంది మరియు పంట విరామ నెలల్లో ముడి పదార్థాల అంతరాలను తగ్గిస్తుంది.
మొక్కజొన్న పంట కోసం కొత్త కలుపు మందు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES