నవతెలంగాణ – భిక్కనూర్
ఇందిరమ్మ పథకంలో పేద కుటుంబానికి కొత్త ఇల్లు లభిస్తుందని, ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ అధ్వర్యంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించే కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీం రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇంటిని నిర్మించుకునే లక్ష్యమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగా రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ పథకంలో పేద కుటుంబానికి కొత్త ఇల్లు: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



