నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ఆర్ జిఎన్ మానవ హక్కులు, అవినీతి నిరోధక సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరెక్షన్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సోమవారం ఎస్ఐ అనిల్ రెడ్డి చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరెక్షన్ అసోసియేషన్ కార్యాలయాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆకుల చందు, తెలంగాణ స్టేట్ ఇన్చార్జి గొల్లపల్లి మహిపాల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సామ కిషన్, ఉపాధ్యక్షులు కరణం నగేష్, జిల్లా ఇంచార్జ్ ఆడేల్లి కార్తీక్, పాలెపు గంగారాం, దుర్గ ప్రసాద్, పూజారి శేఖర్, సురేష్, రాజారాం, సుదర్శన్, ముసల మంగమ్మ, జిల్లా హ్యూమన్ రైట్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


