Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకొండాపూర్‌లో కొత్త పరిశ్రమలు

కొండాపూర్‌లో కొత్త పరిశ్రమలు

- Advertisement -

– రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి : వెల్లడించిన ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

మెదక్‌ జిల్లా కొండాపూర్‌ ఇండిస్టియల్‌ పార్కులో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న కొత్త పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోకొండాపూర్‌ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు మంత్రితో ప్రత్యేకంగా బేటీ అయ్యారు. టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొండాపూర్‌ ఇండిస్టియల్‌ పార్కులో మొత్తం 64 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయనీ, వాటిలో 36 పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వీటివల్ల 5 వేల మంది యువతకు తక్షణం ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. నెల రోజుల్లో విద్యుత్‌ సంబంధ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇండిస్టియల్‌ పార్కును జాతీయ రహదారితో కలిపే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ పెట్టుబడుల విభాగం డైరెక్టర్‌ మధుసూదన్‌, పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు కె.శ్రవణ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు ఎం. శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శి ఎ.సాంబశివరావు, ట్రెజరర్‌ సిహెచ్‌. అశోక్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణస్వామి, ఏవీ రమణ, నవనీత్‌ జైన్‌, సంతోష్‌ కుమార్‌, కేవీఆర్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -