Thursday, September 11, 2025
E-PAPER
Homeజాతీయంవిద్యార్థి దశ నుంచే నూతన ఆవిష్కరణలు

విద్యార్థి దశ నుంచే నూతన ఆవిష్కరణలు

- Advertisement -

ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా ఏపీ
మంగళగిరిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభిచిన సీఎం చంద్రబాబు
గుంటూరు :
రాష్ట్రంలో చదువుకునే యువతకు విద్యార్థి దశలోనే నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళగిరి సమీపంలో మయూరి టవర్స్‌లో నూతనంగా నిర్మించిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను బుధవారం టాటా గ్రూపు చైర్మన్‌ చంద్రశేఖరన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అమరావతితో పాటు విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురంలలో ఏర్పాటు చేసిన హబ్‌లను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ రాష్ట్రం నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందన్నారు. స్టార్టప్‌లకు ఊపరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ రూపొందు తుందన్నారు. యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్‌లకు ఊతం ఇచ్చేలా రతన్‌ టాటా హబ్‌ పనిచేస్తుందన్నారు. రతన్‌ టాటా ఆలోచలను సజీవంగా ఉంచేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు నగరాల్లో ప్రారంభించిన ఈ హబ్‌లు త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు కానున్నాయని తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. అగ్రిటెక్‌లో ఇన్నోవేషన్‌లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలన్నదే తమ లక్షం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇంజినీరింగ్‌ కళాశాలలు తాము ఏర్పాటు చేశామన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిల్‌జెన్సీ ఒక విప్లవాత్మక రంగాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు, పరిశోధనలు, ఎకో సిస్టం ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు అందించగలమన్నారు. రాష్ట్రంలో సంపద పెంచాలని, తద్వారా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండిస్టీయల్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. టాటా సన్స్‌ చైర్మన్‌ రతన్‌ టాటా మాట్లాడుతూ స్టార్టప్‌లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇన్నోవేషన్‌ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్సు, వ్యవసాయం తదితర రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉందన్నారు. స్థానిక, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఐటి, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ ఆవిష్కరణలు అంటే కేవలం ఐటి ఆధారిత సాంకేతికలు మాత్రమే కాదన్నారు. గ్రామాల నుంచి గ్లోబల్‌ స్థాయి వరకు అన్నిరంగాల్లో ఆవిష్కరణలు జరగాలన్నారు. యువత వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తే యావత్‌ ప్రపంచం మీరు తయారుచేసే ఉత్పత్తులను ఆదరిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, బయో డిగ్రేడబుల్‌ వంటి రంగాల్లో ఔత్సాహికులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -