Tuesday, October 14, 2025
E-PAPER
Homeసినిమానయా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

నయా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

- Advertisement -

హీరో విష్ణు విశాల్‌ ‘ఆర్యన్‌’ అనే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్‌ స్టూడియోస్‌, శుభ్ర, ఆర్యన్‌ రమేష్‌లతో కలిసి నిర్మించారు. ఇటీవల రిలీజైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా సోమవారం మేకర్స్‌ ‘ఐయామ్‌ ది గారు’ అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.
జిబ్రాన్‌ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్‌ సాహిత్యం అందించారు. జిబ్రాన్‌, శ్రీకాంత్‌ హరిహరన్‌ అద్భు తంగా పాడారు. ఈ సాంగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. హీరో నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్‌ బస్టర్లను అందించిన ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ బ్యానర్‌ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. శ్రేష్ట్‌ మూవీస్‌ గతంలో ‘విక్రమ్‌, అమరన్‌, థగ్‌ లైఫ్‌’ వంటి చిత్రాలను విడుదల చేసింది.
సెల్వరాఘవన్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీఓపి : – హరీష్‌ కన్నన్‌, సంగీతం – జిబ్రాన్‌, ఎడిటర్‌ – శాన్‌ లోకేష్‌, స్టంట్స్‌ – స్టంట్‌ సిల్వా, పిసి స్టంట్స్‌ ప్రభు, ఎడిషల్‌ స్క్రీన్‌ ప్లే – మను ఆనంద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – ఎస్‌.జయచంద్రన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -