ఇంద్రేశంలో ఆరు, జిన్నారంలో 10 పంచాయతీల విలీనం
ఇస్నాపూర్ మున్సిపాల్టీ విస్తరణ
నూతనంగా ఇబ్రహీంపేట పంచాయతీ ఏర్పాటు
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం-2025 బిల్లుకు గవర్నర్ ఆమోదం
విడుదలైన గెజిట్
ఇంకా ఆమోదం పొందని బీసీలకు
42 శాతం రిజర్వేషన్ల బిల్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో కొత్తగా జిన్నారం, ఇంద్రేశం మున్సిపాల్టీలు ఏర్పడనున్నాయి. అదే సమయంలో ఇస్నాపూర్ మున్సిపాల్టీ మరింత విస్తరించనున్నది. నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాల్టీ పరిధిలోని ఇబ్రహీంపేట నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానున్నది. దీనికి సంబంధించిన తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) చట్టం-2025 బిల్లు శాసనమండలి, శాసనసభలో ఆమోదం పొంది గవర్నర్ వద్దకు చేరిన విషయం విదితమే. తాజాగా గవర్నర్‌కు దానికి ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ విడుదలైంది. దీంతో తెలంగాణ పంచాయతీరాజ్(రెండో సవరణ)చట్టం-2025 బిల్లు చట్ట రూపం దాల్చింది. అయితే, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సడలింపునకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీ రాజ్ (మూడో సవరణ) చట్టం-2025 బిల్లు ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పంచాయతీలో ఆరు గ్రామాలు విలీనమై మున్సిపాల్టీగా మారనున్నది. ఆ మున్సిపాల్టీలో ఇంద్రేశం, బచ్చుగూడెం, రామేశ్వరం బండ, చిన్నకంజర్ల, ఐనోలు, పెద్ద కంజర్ల ఉండనున్నాయి. మొత్తం 18 వార్డులతో మున్సిపాల్టీ ఏర్పాటు కానున్నది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం కూడా 20 వార్డులతో మున్సిపాల్టీగా మారనున్నది. అందులో 10 గ్రామాలు (జిన్నారం, కొడకంచి, జంగంపేట, మంగంపేట, ఊట్ల, శివానగర్, సోలక్‌పల్లి, నల్తూర్, రాళ్లకట్వ, అమ్డూరు) ఉండనున్నాయి. మెదక్ జిల్లా ఇస్నాపూర్ మున్సిపాల్టీలో రుద్రారం, లక్డారం గ్రామపంచాయతీలు విలీనం కానున్నాయి. దీంతో ఆ మున్సిపాల్టీ మరింత విస్తరించనున్నది. నల్లగొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటి పరిధిలోని ఇబ్రహీంపేటను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు.
కొత్తగా జిన్నారం – ఇంద్రేశం మున్సిపాల్టీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES