Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇకపై జీపీఓలకు కొత్తగా మొబైల్ యాప్స్

ఇకపై జీపీఓలకు కొత్తగా మొబైల్ యాప్స్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకువచ్చిందని యాదాద్రి భువనగిరి జిల్లా అదన కలెక్టర్ భాస్కరరావు అన్నారు.  మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసేవల దరఖాస్తుల విచారణ కాగిత రహితం(పెపర్ లెస్)గా చేపట్టనుందన్నారు. ఆయా దరఖాస్తుల వివరాలపై రెవెన్యూ సిబ్బంది విచారణతోపాటు ఇచ్చే నివేదిక ప్రక్రియ మొత్తం ఇక ఆన్లైన్లో కొనసాగనున్నదని తెలిపారు. ఇందు కోసం గ్రామ పాలనాధికారులకు (జీపీఓ) కొత్తగా మొబైల్ యాప్లను ప్రభుత్వం అందు బాటులోకి తీసుకొచ్చిందని వివరించారు.

గత కొంత కాలంగా యాదాద్రి భువనగిరి జిల్లా (5) గ్రామాల్లో జీపీఓల ద్వారా పైలట్ దరఖాస్తులపై మొబైల్ యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తద్వారా ఈ యాప్ ఆచరణలో సాంకేతికం గా తలెత్తుతున్న అంశాలను అధికారులు ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తూ అందుకనుణంగా మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న మొబైల్ యాప్లో సాంకేతిక అడ్డంకులన్నీ అధిగమించి పూర్తీ స్థాయి అప్లికేషను నేటి నుండి (జీపీఓ) లకి అందుబాటులో వచ్చింది, దీనిపై (జీపీఓ) లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ భువనగిరి ఆర్డీవో కృష్ణ రెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్, పరిపాలనాధికారి (మీసేవ) కల్లెక్టరేట్, సాయి కుమార్, ఇ-జిల్లా మేనేజర్, అన్ని మండలాల తహసిల్దార్లు , రెవిన్యూ ఇన్స్పెక్టర్, జీపీఓలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -