Wednesday, December 31, 2025
E-PAPER
Homeసినిమాఈతరం ప్రతిభతో సరికొత్త సినిమాలు

ఈతరం ప్రతిభతో సరికొత్త సినిమాలు

- Advertisement -

నటుడిగా కెరీర్‌ ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారారు బండ్ల గణేష్‌. రవితేజ నటించిన ‘అంజనేయులు’ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతోనే ఆయన తన సొంత బ్యానర్‌ పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రంతో ఈ బ్యానర్‌కు మొదటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ లభించింది.
ఆ విజయం స్ఫూర్తితో ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్‌’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినిమా పరిశ్రమలలో నిర్మాతగా ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు తన కొత్త నిర్మాణ సంస్థ ‘బండ్ల గణేష్‌ బ్లాక్‌బస్టర్స్‌’ (బీజీ బ్లాక్‌బస్టర్స్‌)ని అనౌన్స్‌ చేశారు. ఈ కొత్త అధ్యాయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే విషయం ఏమిటంటే, ఇందులో నెక్స్ట్‌ జనరేష్‌ భాగస్వామ్యం కావడం. బీజీ బ్లాక్‌బస్టర్స్‌ బ్యానర్‌ ద్వారా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, నిజాయితీతో కూడిన కథలు, కంటెంట్‌ రిచ్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో బండ్ల గణేష్‌ ముందుకు సాగుతున్నారు. కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, ఫ్రెష్‌ టాలెంట్‌కు అవకాశం ఇవ్వడమే ఈ బ్యానర్‌ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఒక ప్రాజెక్ట్‌ ఖరారైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -