హైదరాబాద్ : పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడియో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ జేబీఎల్ కొత్తగా ఎంకోర్ 2, ఎంకోర్ ఎసెన్షియల్ 2, 520 పార్టీబాక్స్‌లను విడుదల చేసినట్టు తెలిపింది. ఇవి శక్తివంతమైన ధ్వని, సులభ రవాణా, ఆకర్షణీయ లైటింగ్‌తో సంగీత ప్రియులకు, పార్టీలకు అనుకూలంగా డిజైన్ చేయబడ్డాయని వెల్లడించింది. ఈ నెలలో చార్జ్ 6, ఫ్లిప్ 7 కాంపాక్ట్ వైర్‌లెస్ స్పీకర్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. గృహ వినోదానికి బార్ 1300 సౌండ్‌బార్ కుటుంబ సమావేశాలకు సినిమాటిక్ ధ్వనిని అందిస్తుందని జెబిఎల్ మాతృసంస్థ హర్మన్ ఇండియా ప్రతినిధి యోగేష్ నంబియర్ తెలిపారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ప్రముఖ బ్యాంకుల కార్లుపై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్, వడ్డీ లేని ఈఎంఐ ఎంపికలతో లభిస్తాయన్నారు.