ఇందిరమ్మ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి
నవతెలంగాణ – రామారెడ్డి
కొత్త రేషన్ కార్డుల మంజూరు తో ప్రజలకు ఎంతో మేలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డు మంజూరు పత్రాలను 92 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల మంజూరుతో ప్రజలకు సన్న బియ్యంతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందవచ్చని అన్నారు. మండలంలో 704 నూతన రేషన్ కార్డులు, 1457 పాత రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు చేసినట్లు తెలిపారు. అంతకుముందు రంగంపేటలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని పరిశీలించారు. నిరుపేదలు సైతం సంతోషంగా సొంత ఇంటిలో సౌకర్యవంతంగా నివసించేందుకు ఇందిర మైండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ ను లవ్యమయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం చూసుకుంటుందని, త్వరితగతిన ఇల్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్, ఆర్డీవో కే వీణ, ఏ ఎస్ ఓ స్వామి, తహసిల్దార్ ఉమాలత, విజయ్ పాల్ రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్, వ్యవసాయ అధికారిని భాను శ్రీ, ఎంపీ ఓ తిరుపతిరెడ్డి, ఏపీవో ధర్మారెడ్డి, ఆర్ ఐ రవికాంత్, సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్, పంచాయతీ కార్యదర్శిలు క్రాంతి కుమార్, ప్రశాంత్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
నూతన రేషన్ కార్డులతో ప్రజలకు ఎంతో మేలు: కలెక్టర్ ఆశిష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES