Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు 

కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు 

- Advertisement -

మండల వ్యాప్తంగా కోలాహలంగా ప్రమాణ స్వీకారోత్సవాలు 
నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని 22 గ్రామ పంచాయతీలలో సోమవారం పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కట్టంగూర్ లో ముక్కామల శ్యామల శేఖర్,అయిటిపాములలో బెల్లి సుధాకర్, భాస్కర్ల బాయిలో ఎన్న మౌనిక వెంకటరెడ్డి, బొల్లెపల్లిలో వల్లపు వెంకటనారాయణ రెడ్డి చెరువున్నారంలో చిలుముల సైదులు, దుగునెల్లిలో మల్లబోయిన యాదయ్య, ఈదులూరులో ఇప్పలపల్లి అనిత శీను, ఎరసానిగూడెంలో ఆకిటి శంకర్, గార్లబాయగూడెంలో తేలు సత్తయ్య, ఇస్మాయిల్ పల్లోలో మాదా మమతా సైదులు, కలిమెరలో తోటకూరి జలేంద్రయాదయ్య, కురుమర్తిలో దార సత్తెమ్మ బిక్షం, మల్లారంలో పెద్ది నాగమణిమల్లేష్, మునుకుంట్లలో గుల్లి నరేష్, ముత్యాలమ్మగూడెం లో సుంకరబోయిన సంధ్యావెంకన్న, నల్లగుంట పోలు లో పోన్నబోయినసత్యనారాయణ, నారగూడెం లో కురిమిళ్ళ మల్లేష్, పామనగుండ్ల లో వడ్డే మాధవి సైదిరెడ్డి, పందనపల్లి లో కుంభం అనిల్ రెడ్డి, పరడ లో కొలిపాక సురేందర్, పిట్టంపల్లిలో కనకాల వాణికేశవులు, రామచంద్రపురంలో కొవ్వాకుల రాంబాబులు సర్పంచులుగా బాధ్యతలు చేపట్టారు. ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి గ్రామాలలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని పాలకవర్గాన్ని అభినందించారు. కట్టంగూరు, బొల్లేపల్లి చెరువన్నారం గ్రామాలలో శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్,ఈదులూరు, ఐటపాములలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పాల్గొని అభినందనలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -