నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బిబిపేట్ మండలంలోని జనగామ గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్లు శుక్రవారం మండల అధికారులను కలిశారు. కామారెడ్డి డివిజన్లో ఈనెల 11న జరిగిన స్థానిక ఎన్నికల్లో జనగామ గ్రామం నుండి మట్ట శ్రీనివాస్ సర్పంచ్ గా పాత స్వామి ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు బిబిపేట మండలంలోని తాసిల్దార్ గంగాసాగర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎంపీడీవో పూర్ణచందర్, ఎస్ఐ కొండ విజయలను కలిసి శాలువా కప్పి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామ అభివృద్ధికి సహకరించాలని, మా గ్రామస్తుల సమస్యలు ఏవైనా ఉంటే సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు బీబీపేట మండల మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి ఉన్నారు.
మండలాధికారులను కలిసిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



