Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్వల్లెంకుంట ఇసుక క్వారీలో నయా దందా.!

వల్లెంకుంట ఇసుక క్వారీలో నయా దందా.!

- Advertisement -

గత ఏడాది ఇసుక అమ్ముతున్నామంటూ బుకాయింపు
ఇప్పుడే క్వారీలోకి వేస్తున్న రోడ్డు 
లారీల వద్ద రూ.2 వేలు వసూలు 
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండలంలోని వల్లెంకుంట (అడవి సోమనపల్లి) ఇసుక క్వారీలో నయా దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. గత ఏడాది ఇసుక క్వారీలో ఇసుక మిగిలిందంటూ  అమ్మకాలు చేపడుతున్నారు. ఇందులో పెద్దపెల్లి జిల్లా అడవి సోమన్ పెళ్లి క్వారీ ఇసుకను వలేకుంట పేరు మీద అమ్మకాలు చేపడుతున్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ దందా గత రెండు రోజుల నుండి కొనసాగుతున్న టిఎండిసి అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది చాలదా అంటూ లారీల వద్ద నుండి లోడింగ్ కోసం అదనంగా రూ.1000 నుంచి రూ. 2000 వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు తెలుపుతున్నారు. ఈ క్వారీలో ఈ ఏడాది జనవరిలోనే డంపింగ్ ప్రారంభించినట్లు అధికార రికార్డులో చూపుతున్నారు. అయితే ఇసుక తీసేందుకు ఇప్పుడే క్వారీలో రోడ్డు వేయడం గమనార్హం. ఈ క్వారీ భూపాలపల్లి జిల్లాలో ఉండగా నిర్వహణ పెద్దపల్లి నుండి కొనసాగుతూ ఉండడంతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ క్వారీపై విచారణ చేపడితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు రానున్నాయి. అలాగే ఈ క్వారీలో రోడ్డు వేసేందుకు పక్కనే ఉన్న అటవీ భూమి నుండి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఎర్రమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్న అటు రెవెన్యూ, ఇటు అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా పట్టించుకున్న దాఖలాలు లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -