550వాట్ అవుట్‌పుట్, డాల్బీ అట్మాస్‌తో ఆడియో
చెన్నయ్ : ప్రముఖ ఆడియో టెక్ బ్రాండ్ జెబ్రోనిక్స్ తన సరికొత్త సౌండ్‌బార్ జిబ్ జూక్ బార్ 9710ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. చిన్నదే పెద్ద సంచలనం అనే నినాదంతో రూపొందించిన ఈ కాంపాక్ట్ సౌండ్‌బార్ 550వాట్ ఆర్‌ఎంఎస్ శక్తివంతమైన అవుట్‌పుట్‌ను అందిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఇందులో డాల్బీ అట్మాస్ సాంకేతికతను జోడించడం వల్ల సినిమా హాల్ వంటి అనుభూతి ఇంట్లోనే లభిస్తుందని పేర్కొంది. బహుళ కనెక్టివిటీ ఆప్షన్లను కలిగిన ఈ సౌండ్‌బార్ ప్రారంభ ధర రూ.16,999గా నిర్ణయించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సినిమా స్థాయి ఆడియో అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని జెబ్రోనిక్స్ కోఫౌండర్ ప్రదీప్ దోషి పేర్కొన్నారు.



