Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలువరిధాన్యం కొనుగోళ్లకు కొత్త సాంకేతికత

వరిధాన్యం కొనుగోళ్లకు కొత్త సాంకేతికత

- Advertisement -

చిన్న పరికరం సాయంతో సన్నాల గుర్తింపు

నవతెలంగాణమల్హర్ రావు

ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా, పార దర్శకంగా జరిగేలా మండల యంత్రాంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాల గుర్తింపునకు ఇప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది.మండలం వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, ప్రతీ కేంద్రంలో అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచనున్నారు.

గ్రేయిన్ క్యాలీఫర్..

ధాన్యాన్ని రకాల వారీగా గుర్తించడంలో గ్రేయిన్ క్యాలీఫర్ కీలకపాత్ర పోషిస్తోంది. ధాన్యంలో ఉన్న బియ్యం గింజ పొడవు, వెడల్పు వంటి ప్రమాణాలను పరికరం ద్వారా లెక్కించి సన్న, దొడ్డు రకాలని తెల్సానున్నారు.వరి సంచులపై ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గుర్తుల ద్వారా రైతులకు తెలిసేలా చెబుతారు.రైతులు తెచ్చిన సన్న రకాలను ప్యాడీ పాస్కల్తో పిడికెడు ధాన్యం పోసి తిప్పితే ధాన్యంపై గల పొట్టు ఊడి పోతుంది. అప్పుడు బియ్యం గింజ బయటకు వస్తుంది. పొట్టు తీసిన బియ్యం గింజను గ్రేయిన్ క్యాలీఫర్లో వేస్తారు.గింజ పొడవు, వెడల్పు లెక్కించి వచ్చిన శాతం ఆధారం గా వాటిని సన్న రకాలుగా గుర్తించనున్నారు.

కౌలు రైతులకు డిజిటల్ అనుమతి..

కౌలు రైతుల కోసం స్వచ్ఛమైన అనుమతి విధానం ప్రవేశపెట్టారు.యజమాని-రైతు ఆధార్ అను సంధానం,ఓటీపీ ధ్రువీకరణ వంటి మునుపటి దశలను పూర్తి చేసినప్పుడే కొనుగోళ్లకు వీలు ఉం టుంది. ఇది అత్యధిక భద్రతతోపాటు నేరుగా రైతు ఖాతాలోనే చెల్లింపు జరిగేలా చూసేందుకు ప్రభు త్వం ఏర్పాటు చేసిన నూతన డిజిటల్ ఏర్పాటుగా నిలుస్తోంది. ఖరీఫ్ లో 15,500 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్ కు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రకాల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచి, రైతులకు అన్ని విధాలుగా మేలును అందించటానికి నూతన వేదిక సిద్ధమైంది.

ప్రభుత్వ సూచనల మేరకు..

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్..ఇప్ప మొండయ్య.

ప్రభుత్వ సూచనల మేరకు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 16 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని కొనుగోలు కేంద్రాలకు పరికరాలు సరఫరా అయ్యేలా చూస్తాం. ప్రభుత్వ సూచనల మేరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -