Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో..'నవతెలంగాణ' బుక్‌స్టాల్‌

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో..’నవతెలంగాణ’ బుక్‌స్టాల్‌

- Advertisement -

ప్రారంభించిన ప్రిన్సిపాల్‌ కాంచనవల్లి
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
ప్రముఖ విద్యాకేంద్రం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 71లో గల జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో శనివారం నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ బుక్‌స్టాల్‌ను ప్రిన్సిపాల్‌ కాంచనవల్లి లైబ్రేరియన్‌ సుజాత లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌లో తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ మూడు భాషలలో సుమారు 1000 రకాల పుస్తకాలను స్కూల్‌ ఆవరణలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జూబ్లీహిల్స్‌ సొసైటీలోని కాలనీవాసులు శనివారం, ఆదివారం స్కూల్‌ వద్దకు వచ్చి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుక్‌స్టాల్‌ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అన్ని పుస్తకాలపై డిస్కౌంట్‌ ఉందన్నారు. ఈ బుక్‌ స్టాల్‌ను నవతెలంగాణ బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ వాసు, మేనేజర్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు మార్కెటింగ్‌ ఇన్‌చార్జి సర్దార్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్కూల్‌ డైరెక్టర్‌ వరలక్ష్మి, ప్రెసిడెంట్‌ మురళి ముకుంద, సెకండరీ హెచ్‌ఎం శ్రీదేవి శ్రీరామ్‌ సహాయ సహకారాలు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -