కొండమడుగు పంచాయతీ కార్యదర్శి అలివేలు సస్పెండ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో పలు అక్రమాలకు పాల్పడిన సెక్రెటరీ అలివేలును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండమడుగు మండల పంచాయతీ అధికారి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి మాజిద్ ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసి, కొండమడుగు సెక్రెటరీపై సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ సీఈవో విష్ణువర్ధన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీలలో ఇటువంటి వాటిపై విచారణ జరపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో అధికారులు అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
నవతెలంగాణ ఎఫెక్ట్.. కార్యదర్శి సస్పెండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES