-ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక పీడిత, తాడిత, శ్రామిక వర్గాల పక్షాన నిలబడి, వారి సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజాగొంతుకైన నవతెలంగాణ పత్రిక పదో వార్షికోత్సవం జరుపుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. పేదల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆ పత్రిక పనిచేస్తున్నదని తెలిపారు. పదేండ్ల కాలంలో రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి వార్తలు, కథనాలు రాయటంలో ముందుందనీ, ఆ సమస్యలను సంబంధిత అధికారులకు చేరేలా వార్తలు రాసి, బాధితులకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తోందని పేర్కొన్నారు. నిత్యం శ్రామిక వర్గాల పక్షాన నిలబడుతున్న పత్రిక యాజమాన్యం, సిబ్బంది, విలేకర్లకు ఆయన వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పీడిత, శ్రామిక వర్గాల పక్షాన నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES