Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణలో కొత్తగా టూరిస్ట్ పోలీసులు..

తెలంగాణలో కొత్తగా టూరిస్ట్ పోలీసులు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా టూరిస్ట్ పోలీసులను రంగంలోకి దింపనుంది. తెలంగాణ రాష్ట్రంలో పర్యటకుల కోసం.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా తెలంగాణ డిజిపి జితేందర్ ప్రకటన చేశారు.

తొలి దశలో 80 మంది పోలీసులు పని చేయనున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతగిరి రామప్ప సోమశిల నాగార్జునసాగర్ బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాలలో స్వదేశీ అలాగే విదేశీ టూరిస్టులకు ఈ పోలీసులు రక్షణ కల్పించబోతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు తెలంగాణ డిజిపి జితేందర్. వచ్చే నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సిస్టం అందుబాటులోకి రాబోతుందని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad