Friday, February 27, 2026
E-PAPER
Homeకరీంనగర్మంత్యనాయక్ తండాలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

మంత్యనాయక్ తండాలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

- Advertisement -

-ఓవర్‌లోడ్ సమస్యకు పరిష్కారం 
నవతెలంగాణ-రాయికల్

మండలంలోని మంత్యనాయక్ తండాలో విద్యుత్ ఓవర్‌లోడ్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం అధికారికంగా ఆన్ చేశారు .తండాలో తరచూ ఎదురవుతున్న లోడ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్న ఎడీ సింధు శర్మ, ఏఈ రాజేశం కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో రైతులకు,గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలోత్ తిరుపతి, విద్యుత్ శాఖ సిబ్బంది ఆంజనేయులు,శ్రీనివాస్,మహేష్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -