Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్హరిత కాలనీలో నూతన వాసవి హరిత ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు...

హరిత కాలనీలో నూతన వాసవి హరిత ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు…

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హరిత కాలనీలో నూతన ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సిద్ధంశెట్టి వెంకటేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘానికి వాసవి హరిత ఆర్యవైశ్య సంఘం గా పేరును నిర్ణయించడం జరిగిందన్నారు. నూతన సంఘానికి  కార్యదర్శి గా చిదుర ప్రశాంత్, కోశాధికారిగా బంధం శ్రీను, ఉపాధ్యక్షులుగా కొమిరిసేటి గంగరాజులు, సంయుక్త కార్యదర్శిగా జలిగాం రామకృష్ణ లను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఐక్యమత్యానికి ఈ సంఘం కృషి చేస్తుందని నూతన కార్యవర్గం పేర్కొనడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -