Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రారం చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

రుద్రారం చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, కృతజ్ఞతాకూడికలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచ్ చంద్రగిరి సంపత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య హాజరై మాట్లాడారు. దేవుని కృప వల్ల గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడం సంతోషకరమని, ఈ 2026 సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధిలో అందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, గాదె గట్టయ్య, బుచ్చయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -