నవతెలంగాణ – సదాశివపేట
రాఘవేంద్ర నగర్ కాలనీ 8వ వార్డులో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ యువ నాయకులు కొత్త గొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రేమ స్వరూపి చర్చిలో పాస్టర్ డేనియల్ రాజు సమక్షంలో కేక్ కట్ చేయగా, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబం అన్ని విధాలుగా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువ నాయకుడు కొత్త గొల్ల సోమశేఖర్ మాట్లాడుతూ.. రాబోయే 2026 సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించి, అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని కోరుకున్నారు. స్థానిక చర్చి పాస్టర్, బిషప్ యం. డానియల్ రాజ్ దేవుని వాక్యాలను తెలియజేస్తూ, ప్రజలంతా ప్రేమ, శాంతి, ఐక్యతతో జీవించాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. జాన్వేసి, పి. ప్రేమ్ కుమార్, చెన్నాకర్, మురళీ గౌడ్, యాదుల్, హజ్జు, సంఘ పెద్దలు, మహిళలు, యువకులు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.



