Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి 

కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి 

- Advertisement -

– డిజీఏలకు అనుమతి లేదు
మద్యం సేవించి వాహనాలు నడపరాదు 
నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
రాబోయే కొత్త సంవత్సరం వేడుకలను మండల ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని డిజే ఏ లకు అనుమతి లేదని నెల్లికుదురు ఎస్సై చిర రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నేల్లికుదురు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా ఎలాంటి డీజేలకు అనుమతి లేదు కావున ప్రజలు గమనించి సహకరించగలరు అని అన్నారు.నిబంధనలకు విరుద్ధంగా డీజే లు నిర్వహించినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడును అని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు డిసెంబర్ 31 మరియు జనవరి 1 రోజులలో నేల్లికుదురు ప్రాంతం అంతట డ్రంక్ అండ్ డ్రైవరు నిర్వహిస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.. అని అన్నారు.

ప్రజలు ఎవరూ కూడా 31 డిసెంబర్ రాత్రి రోడ్లమీద కేకులు కట్ చేయడం గానీ బైకుల మీద ఓవర్ స్పీడ్ తో వెహికల్స్ నడపడం గాని చేయరాదు అలా చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి. రోడ్లపైన క్రాకర్స్ కాల్చడం వంటివి చేయరాదు. డిసెంబర్ 31 అనేది ప్రతి సంవత్సరం వస్తుంది కానీ జీవితం కోల్పోతే మళ్ళీ రాదు అనే సూచించారు. కావున అందరూ గమనించగలరు ముఖ్యంగా యువత ఒక్కరోజు ఆనందం గురించి జీవితాన్నిపణంగా పెట్టకండి. అదేవిధంగా చైనా మాంజా ఉపయోగించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించడం జరిగింది. కావున చైనా మాంజా వినియోగించకూడదు, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని నెల్లికుదురు ఎస్సై ఇచ్చారా రమేష్ బాబు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -