Thursday, December 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలున్యూ ఇయ‌ర్ జోష్‌..హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక త‌నిఖీలు

న్యూ ఇయ‌ర్ జోష్‌..హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక త‌నిఖీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నగరంలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు ఉంటాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

తొలి రోజు అయిన బుధవారమే డ్రంక్ అండ్ డ్రైవ్‌ పరీక్షలో 304 మందిని పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 304 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర వాసులకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -