Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచులకు నూతన సంవత్సర గ్రీటింగ్స్ 

సర్పంచులకు నూతన సంవత్సర గ్రీటింగ్స్ 

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – ఆలేరు 

ఆలేరు నియోజకవర్గం లో 8 మండలాల్లో గెలుపొందిన సర్పంచులకు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీటింగ్స్ తోపాటు స్వీట్ బాక్స్ అభినందిస్తూ లెటర్ అందజేస్తున్నట్టు ప్రభుత్వ విత్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం నవతెలంగాణ రిపోర్టర్లు మొరిగాడి మహేష్  పేరబోయిన నరసింహులు మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లగా గ్రీటింగ్స్ అందజేసి ఈ విషయాన్ని చెప్పారు. నూతన సంవత్సరంలో గెలుపొందిన సర్పంచ్ లు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు రెట్టింపు పూత్సాహంతో ప్రజా సంక్షేమం కోసం గ్రామాలు  అభివృద్ధి చెందేందుకు కంకణ బద్దలు కావాలని పిలుపునిచ్చారు.

పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకొని ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందడుగు వేయడంలో కలిసి పని చేద్దాం అన్నారు.ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలి ప్రజా ప్రతినిధులుగా ప్రజల బాగోగులు మాత్రమే నిరంతరం చూడాలన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్, సీపీఐ(ఎం), సిపిఐ, బిజెపి, సిపిఐ ఎంఎల్ పార్టీలు తారతమ్యం లేకుండా సర్పంచ్ లందరికీ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వ నుండి పంపిణీ చేయిస్తానన్నారు. గెలుపొందిన అన్ని పక్షాల సర్పంచులు సమస్యలు ఉంటే తన వద్దకు నేరుగా రావచ్చని రాజకీయాలను మనసులో పెట్టుకోవద్దన్నారు.నూతన సంవత్సరం సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు బిఆర్ఎస్, సీపీఐ(ఎం), సిపిఐ, బిజెపి, సిపిఐఎంఎల్ పార్టీల నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -