Friday, July 18, 2025
E-PAPER
Homeఆటలున్యూజిలాండ్‌ గెలుపు

న్యూజిలాండ్‌ గెలుపు

- Advertisement -

టి20 ట్రయాంగులర్‌ సిరీస్‌
హరారే:
టి20 ట్రయాంగు లర్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు శుభారంభం చేసింది హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 172పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 18.2ఓవర్లలో 152పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ జట్టులో రాబిన్సన్‌(75; 57బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), జాకోబ్‌(44; 30బంతుల్లో ఫోర్‌, 3సిక్సర్లు) రాణించగా.. దక్షిణాఫ్రికా బౌలర్లు క్వెనాకు రెండు, ఎన్గిడి, కోర్ట్జే, ముత్తుసామికి ఒక్కో వికెట్‌ దక్కాయి. ఇక దక్షిణాఫ్రికా జట్టులో బ్రెవీస్‌(35), లిండే(30) బ్యాటింగ్‌లో రాణించగా.. న్యూజిలాండ్‌ బౌలర్లు హెన్రీ, డఫీకి మూడేసి, సోథీకి రెండు, సాంట్నర్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మాయచ్‌ రాబిన్సన్‌కు దక్కింది. తొలి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 5వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -