జోరు వానలో తగ్గని జోష్
నవతెలంగాణ-ఓయూ
నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గురువారం క్రీడా పోటీలు హోరా హోరీగా, సందడిగా కొనసాగాయి. రాష్ట్ర, జిల్లా బ్యూరోల రిపోర్టర్లు, హైదరాబాద్ జిల్లా రిపోర్టర్స్, ఉద్యోగులు వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వృత్తిపరంగా ప్రతిరోజూ రిపోర్టింగ్ పనుల్లో నిమగమయ్యే వారు చిన్నపిల్లల్లా మారి మైదానంలో చురుకుగా కనిపించారు. వర్షపు జల్లులు, ముసురు కురుస్తున్నప్పటికీ ఉత్సాహంగా ఆడారు. మొదటి రోజు నాలుగు కబడ్డీ జట్లు, ఐదు వాలీబాల్ జట్లు హౌరాహౌరీగా తలపడ్డాయి. ఆటలు సజావుగా సాగేందుకు నవతెలంగాణ హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ పి.నరేందర్ రెడ్డి పర్యవేక్షించగా.. హైదరాబాద్ జిల్లా జీఎం లింగారెడ్డి, ఫైనాన్స్ జీఎం శశిధర్, మఫిషియల్ ఇన్‌చార్జి వేణుమాధవ్‌తోపాటుగా ఎడిటోరియల్ బోర్డు, అడ్మిని స్టేషన్, ప్రింటింగ్ ప్రెస్, బుకహేౌస్ ఉద్యోగులు, హైదరాబాద్, రంగారెడ్డి రీజియన్స్ సిబ్బంది పాల్గొన్నారు. వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ క్రీడలు ఉద్యోగుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. మరో నాలుగు రోజులపాటు పోటీలు సాగనున్నాయి.
హోరాహోరీగా నవతెలంగాణ క్రీడా పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES