Monday, October 6, 2025
E-PAPER
Homeబీజినెస్కొత్తగా లాంచ్ అవుతున్న "విష్‌ క్రెడిట్ కార్డ్‌"

కొత్తగా లాంచ్ అవుతున్న “విష్‌ క్రెడిట్ కార్డ్‌”

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్‌పే, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కలిసి విష్‌ క్రెడిట్ కార్డును లాంచ్ చేస్తున్న‌ట్లు ఈరోజు (అక్టోబర్ 06) ప్రకటించాయి. ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయ‌డానికి ఫోన్‌పే యాప్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది, దీనివల్ల లక్షల మంది వినియోగదారులు సులభంగా, వేగంగా అప్లై చేయగలరు. ఈ భాగస్వామ్యం ద్వారా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫోన్‌పే తమ ఉత్పత్తులను, సేవలను మరింత విస్తృతంగా డిజిటల్ అవగాహన ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌కు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. 

ప్ర‌తి ఇండియ‌న్‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)భద్రతను, క్రెడిట్ కార్డ్ యొక్క సౌలభ్యంతో కలిపి, ఇటు క్రెడిట్‌ను కూడా యాక్సెస్ చేసే వెసులుబాటును క‌లిగించేలా విష్‌ క్రెడిట్ కార్డును రూపొందించారు. ఇది క్రెడిట్ ప్రపంచంలో కొత్తగా అడుగుపెడుతున్న స్వయం ఉపాధి క‌లిగిన‌ వ్యక్తులకు, గృహిణులకు, Gen Z కస్టమర్లకు, అలాగే క్రెడిట్ కార్డుల ల‌భ్య‌త‌ తక్కువగా ఉండే ద్వితీయ‌, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందిన వారికి ఆదర్శవంతమైన ఎంపిక కావచ్చు. యూజ‌ర్‌లు కేవలం ₹2000 నుండి డిపాజిట్ చేయడం ప్రారంభించడం ద్వారా విష్‌ క్రెడిట్ కార్డును పొంద‌వ‌చ్చు, ఇది చ‌వ‌కైన‌ది, అందుబాటులో ఉండేది. FD కేవ‌లం క్రెడిట్ కార్డుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, వడ్డీ ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ఈ కార్డు రూపే క్రెడిట్ కార్డు అయినందున, అంత‌రాయాల్లేని UPI పేమెంట్లు చేయ‌గ‌లుగుతారు. అదేవిధంగా, ఈ కార్డు ద్వారా రోజువారీ ఖర్చులపై రివార్డ్స్ కూడా లభిస్తాయి. జ‌నాభాలోని అన్ని వ‌ర్గాలకు క్రెడిట్ కార్డుల‌ను చేరువ చేసే క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్లకు మంచి క్రెడిట్ హిస్ట‌రీని నిర్మించ‌డంలో ఈ ప్రోడ‌క్ట్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -