Saturday, April 4, 2026
E-PAPER
Homeక్రైమ్పెళ్లైన నెలకే నవ వధువు ఆత్మహత్య..

పెళ్లైన నెలకే నవ వధువు ఆత్మహత్య..

- Advertisement -

కల్లెడ గ్రామంలో విషాద ఛాయలు
నవతెలంగాణ – ఆర్మూర్  

ఆర్మూర్ మండలం కల్లేడి గ్రామంలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాన్సువాడకు చెందిన అఖిలకు కల్లేడి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో గత నెల మార్చి 5న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లైన పది రోజుల తర్వాత అఖిల తన పుట్టింటికి వెళ్లి శుక్రవారం కల్లెడ గ్రామానికి చేరుకుంది.

శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ అఖిల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -