- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం(25), భవాని(19) దంపతులు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి బయలుదేరారు. వంగపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న వీరిద్దరూ జారిపడి మృతిచెందారు.
- Advertisement -



