వంట కోసం గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించడం సర్వసాధారణం. గ్యాస్ లీకేజీ, మంటలు వచ్చే అవకాశం ఉన్నందున గ్యాస్ స్టవ్‌లపై వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. దీని గురించి జాగ్రత్తగా ఉండటంతో పాటు, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం…
వంట నూనె
కొంతమంది వంట నూనె డబ్బాను గ్యాస్ స్టవ్ పక్కన ఉంచుతారు. దీనివల్ల వంట చేసేటప్పుడు నూనె వేడెక్కి నాణ్యత క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. దాన్ని గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకూడదు.
ప్లాస్టిక్ వస్తువులు : ప్లాస్టిక్ కంటైనర్లు లేదా ఇతర ప్లాస్టిక్ వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడదు. ఎందుకంటే వేడికి ప్లాస్టిక్ కరిగి మంటలు చెలరేగవచ్చు.
సుగంధ ద్రవ్యాలు : చాలా మంది మహిళలు మసాలా దినుసుల డబ్బాను గ్యాస్ స్టవ్ పక్కన ఉంచుతారు. ఎందుకంటే వంట తయారీకి అందుబాటులో ఉంటుందని ఇలా పక్కనే ఉంచుతారు. అలా చేయ డం వల్ల సుగంధ ద్రవ్యాల నాణ్యత దెబ్బతింటుంది.
క్లీనర్లు : స్ప్రేలు వంటి క్లీనింగ్ ఉత్పత్తులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడదు. దీనివల్ల మంటలు చెలరేగవచ్చు. కాబట్టి, మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
విద్యుత్ ఉపకరణాలు: విద్యుత్ ఉపకరణాలను చాలా వేడిగా ఉన్న ప్రదేశాలలో ఉంచకూడదు. ఎందుకంటే అధిక వేడి విద్యుత్ ఉపకరణాలను దెబ్బతీస్తుంది. షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతుంది.
మసి బట్టలు : కొంతమంది మసి బట్టలను గ్యాస్ స్టవ్ పక్కనే ఉంచుతారు. దీనివల్ల కొన్నిసార్లు మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి, బట్టలు గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకపోవడమే మంచిది.
గ్యాస్ స్టౌ పక్కన…
- Advertisement -
- Advertisement -