Tuesday, July 1, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్లో నిఖత్‌, లవ్లీనా

ఫైనల్లో నిఖత్‌, లవ్లీనా

- Advertisement -

– నీతూ, స్వీటీ బూరా సైతం
– మహిళల ఎలైట్‌ బాక్సింగ్‌ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ప్రపంచ చాంపియన్‌, స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ లవ్లీనా బొర్గొహైన్‌ మహిళల ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. వరుసగా మూడో విజయం నమోదు చేసిన నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గొహైన్‌ ఇక పసిడి కోసం రింగ్‌లోకి దిగనున్నారు. నీతు, స్వీటీ బూరా సైతం పసిడి పోరుకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్‌ బౌట్‌లో నిఖత్‌ జరీన్‌ మహిళల 51 కేజీల విభాగంలో మెరిసింది. తమిళనాడు బాక్సర్‌ లక్ష్యపై 5-0తో సూపర్‌ విక్టరీ సాధించింది. మహిళల 75 కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌ బాక్సర్‌ స్నేహపై లవ్లీనా బొర్గొహైన్‌ నాకౌట్‌ విజయం సాధించింది. 48 కేజీల విభాగంలో నీతు 5-0తో మంజు రాణిపై గెలుపొందగా.. 80 కేజీల విభాగంలో స్వీటీ 5-0తో అలవోక విజయం నమోదు చేసింది. ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నీలో నేడు ఫైనల్స్‌ జరుగనుండగా.. నిఖత్‌ జరీన్‌, లవ్లీనా, నీతు, స్వీటీ పసిడి ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -