Wednesday, July 2, 2025
E-PAPER
Homeఆటలునిఖత్‌ జరీన్‌కు గాయం

నిఖత్‌ జరీన్‌కు గాయం

- Advertisement -

ఫైనల్లో పోటీ నుంచి తప్పుకున్న స్టార్‌ బాక్సర్‌
హైదరాబాద్‌ :
ప్రపంచ చాంపియన్‌, తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు గాయమైంది. హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న నిఖత్‌.. తొలి బౌట్‌లో తగిలిన ముక్కు గాయం తీవ్రం కావటంతో పసిడి పోరు నుంచి తప్పుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో జ్యోతి స్వర్ణం తీసుకోగా.. నిఖత్‌ జరీన్‌ సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 48 కేజీల విభాగంలో నీతు, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్‌, 80 కేజీల విభాగంలో స్వీటీ, 65కేజీల విభాగంలో అంకుశిత బొరొ, 60 కేజీల విభాగంలో ప్రాచి పసిడి పతకాలు సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -