సెమీస్ ఎంట్రీతో పతకం ఖాయం
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
ఉలాన్బాతర్ (మంగోలియా) : భారత స్టార్ బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ పతక పంచ్ విసిరింది. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించిన తెలంగాణ అమ్మాయి పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్లో తొలి రౌండ్లోనే నాకౌట్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫిలీప్సీన్స్ బాక్సర్‌ను చిత్తు చేసిన నిఖత్ జరీన్.. పంచ్‌ల వర్షంతో ఒక్క రౌండ్లోనే లెక్క తేల్చింది. పసిడి వేటలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న నిఖత్ జరీన్.. నేడు సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ పసిడి విజేత, చైనా బాక్సర్ యు వుతో పోటీపడనుంది. మహిళల 60 కేజీల విభాగంలో ప్రియ అద్భుత పరిణతి చూపించింది. చైనా బాక్సర్ చెంగ్యూ యాంగ్‌పై 4-1తో కండ్లుచెదిరే విజయం సాధించింది. నేడు సెమీస్‌లో మంగోలియా బాక్సర్ నమున్‌తో ప్రియ తలపడనుంది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతీ పవార్ సైతం సెమీస్‌కు చేరుకుంది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో పసిడి పతకం సాధించిన ప్రీతీ.. మంగోలియా బాక్సర్‌ను 5-0తో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఫైనల్లో చోటు కోసం దక్షిణ కొరియా బాక్సర్, పారిస్ ఒలింపిక్ మెడలిస్ట్ ఏజీతో ప్రీతీ పంచ్ పవర్ తేల్చుకోనుంది. పురుషుల 70 కేజీల విభాగంలో దీపక్ -4తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
నిఖత్ జరీన్ జోరు
- Advertisement -
- Advertisement -


